జగన్ పాలన.. ఏపీకి శాపం..
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు…
కేంద్ర ప్రభుత్వం, దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉండాలి అనే స్కీం తెచ్చింది. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు అంది పుచ్చుకున్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణా 2019-24 మధ్య 38 మెడికల్ కాలేజీలు సాధించుకుని, ప్రారంభించుకుంది.
తమిళనాడు 29, కర్ణాటక 16 సాధించుకున్నాయి. ఇటు ఉత్తర ప్రదేశ్ 40, మహారాష్ట్ర 28, రాజస్థాన్ 21, ఇలా పెద్ద రాష్ట్రాలు అన్నీ భారీగా కాలేజీలు సాధించుకుని, 2019-24 మధ్య ప్రారంభించుకున్నాయి. చివరకు అస్సాం కూడా 8 మెడికల్ కాలేజీలు సాధించుకుంది.
ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఖర్మ, జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం.. అతను సాధించింది కేవలం 5. వీటికి తోడుగా చంద్రబాబు గారు 2018లోనే మొదలు పెట్టిన ఏలూరు, విజయనగరం కాలేజీలు. మొత్తం 17 మెడికల్ కాలేజీలు మనకు అవకాశం ఉంటే, కేవలం 7 మెడికల్ కాలేజీలు చాలు అని జగన్ ప్రతిపాదనలు పంపాడు. కొన్ని పునాదులు కూడా దాటలేదు..
మిగతా రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని 30కి పైగా మెడికల్ కాలేజీలు కేవలం 5 ఏళ్ళలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే, జగన్ రెడ్డి ముక్కి మూలిగి 5 పూర్తి చేసాడు… అది కూడా అరకొర పనులు.. మిగతా పనులు అన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి..
#AndhraPradesh

Arattai