త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ ?
పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత. కాసేపట్లో ప్రకటించినున్న కవిత. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్న కవిత. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న కవిత.
కొంత కాలంగా పార్టీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో.. కొంత కాలంగా కవిత పైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఇక.. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించిన వేళ.. కవిత సీరియస్ కామెంట్స్ చేసారు. వీటిని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్ వేటు వేసారు. దీంతో, ఇప్పుడు కవిత రాజకీయ కార్యాచరణ పైన ఆసక్తి నెలకొంది.
బీజేపీలో బీఆర్ఎస్ పొత్తు
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తదుపరి అడుగుల పైన ఆసక్తి నెలకొంది. కవిత లేఖతో ఒక్క సారిగా బీఆర్ఎస్ లో కలకలం మొదలైంది. బీజేపీలో బీఆర్ఎస్ పొత్తు దిశగా చర్చలు జరిగాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. తన అన్న కేటీఆర్ పైన కవిత పరోక్ష వ్యాఖ్యలు చేసారు.
తన తండ్రికి మద్దతుగా నిలుస్తూనే.. కేసీఆర్ దగ్గర దయ్యాలు ఉన్నాయంటూ కవిత వ్యాఖ్యానించారు. కవిత పైన పార్టీ నేతలు ఎవరూ స్పందించవద్దని కొద్ది రోజుల క్రితం కేసీఆర్ నిర్దేశించారు. ఇక.. పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ తరువాత సీబీఐకి కేసు అప్పగించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. దీంతో, కవిత సీరియస్ గా స్పందించారు.
కవిత సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి హరీష్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ పైన కవిత సంచలన ఆరోపణలు చేసారు. వారిద్దరిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. దీంతో, కేసీఆర్ ఈ విషయం పైన పార్టీ ముఖ్యులతో చర్చించారు. కవిత పైన సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయించారు.
కవిత సొంత పార్టీ పైన వ్యాఖ్యల సమయంలోనే తన రాజకీయ భవిష్యత్ పైన పూర్తి స్పష్టతతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టేందుకు కవిత సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ జాగృతి – కొత్త పార్టీ
కొత్త పార్టీ కోసం ఇప్పటికే పేర్ల పైన చర్చించినట్లు సమాచారం. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి(టీబీఆర్‌ఎస్) పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్ పేరు పైనా సాధ్యాసాధ్యాలు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు సస్పెన్షన్ వేటు తరువాత కవిత నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొంది.
Arattai