
బ్యాంకు లోన్ ఎగ్గొట్టేందుకు చనిపోయినట్లు కథ అల్లిన బీజేపీ నేత కుమారుడు
మధ్యప్రదేశ్‌లో బ్యాంకుల నుండి రూ.1.40 కోట్ల రుణం తీసుకున్న రాజ్‌గఢ్ బీజేపీ నేత మహేష్ సోని కుమారుడు విశాల్ సోని
తాను చనిపోయినట్లు నమ్మిస్తే బ్యాంకు రుణాల నుండి విముక్తి దొరుకుద్దని, కలిసింధ్ నదిలో కారును పారేసి నాటకమాడిన విశాల్ సోని
10 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి, కారును వెలికి తీసి అది విశాల్ సోనీదిగా గుర్తించిన రెస్క్యూ సిబ్బంది.. విశాల్ సోనీ కోసం గాలింపు చర్యలు కొనసాగింపు
మరో వారం రోజుల తర్వాత కూడా నదిలో ఎలాంటి జాడ దొరకకపోవడంతో, అనుమానంతో విశాల్ సోనీ మొబైల్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు
చివరి సిగ్నల్స్ మహారాష్ట్రలో ఉండడంతో మహారాష్ట్ర – శంభాజీ నగర్ జిల్లాలోని ఫర్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాల్ సోనీ అరెస్ట్
తనకు రూ.1.40 కోట్ల అప్పు ఉందని, మరణ ధృవీకరణ పత్రం లభిస్తే బ్యాంకు రుణాల నుండి తప్పించుకోవచ్చని డ్రామా ఆడినట్లు ఒప్పుకున్న విశాల్ సోనీ
మరణించినట్లు డ్రామా ఆడడం వల్ల కేసు వేయడానికి రాజ్యాంగ నిబంధన లేదని, ఎలాంటి శిక్ష వేయకుండా విశాల్ సోనీని వారి కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు
Arattai