నేపాల్‌లోని ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నం చేస్తున్నాం-మంత్రి నారా లోకేష్
మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 12 వేర్వేరు ప్రాంతాల్లో 217 మంది ఏపీ వ్యక్తులు నేపాల్‌లో ఉన్నారు. కాఠ్‌మాండూ నుంచి రేపు మధ్యాహ్నం ఏపీ వ్యక్తులను తీసుకొస్తున్నాం. రేపు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఏపీ వాళ్లను తరలిస్తున్నాం.
నేపాల్‌లోని ఏపీ వ్యక్తులందరినీ ఇంటికి చేర్చే బాధ్యత మాది.
కార్యదక్షత అనండి. సంకల్పం అనండి. నిబద్ధత అనండి. గురువారం సాయంత్రం కల్లా నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారందరూ ఏపీకి చేరుకుంటారు అని బుధవారం భరోసా ఇచ్చిన లోకేష్ తాను చెప్పిన మాటను చెప్పినట్టుగా నిలబెట్టుకున్నారు.
నేపాల్‌లోని తెలుగువారిని ఏపీకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ భవన్‌లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి నేపాల్‌లోని తెలుగువారిని గుర్తించాం.
నేపాల్‌లో 12 ప్రదేశాల్లో చిక్కుకున్న 217మందిని సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అలుపెరగకుండా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తొలివిడతగా నేపాల్ లోని హెటౌడా నుంచి 22మంది ఏపీ వాసులను సురక్షితంగా బీహార్ బోర్డర్, అక్కడి నుంచి రాష్ట్రానికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తమను క్షేమంగా స్వరాష్ట్రానికి తరలిస్తున్న మంత్రి లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఖాట్మాండు పరిసరాల్లో ఉన్న 173మందిని తరలించేందుకు ప్రత్యేక విమానం రేపు ఉదయం 10గంటలకు డిల్లీ నుంచి ఖాట్మాండు చేరుకుంటుంది. ఖాట్మాండూలో కర్ఫ్యూ సడలించిన వెంటనే వీరందరినీ విశాఖపట్నం, విజయవాడ తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
Arattai