హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది
హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశాం
రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే.. మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తాం
ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్ళైనా నీళ్ల కరువు లేకుండా చేస్తాం
హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా నీళ్లు ఇచ్చేట్టు చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం – కేటీఆర్
రేవంత్ రెడ్డికి సిగ్గుందా?
మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెలల తరబడి కార్మికులలా పని చేసి రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు
21 నెలల నుండి ఆ డ్రగ్స్ కంపెనీపై ఏం చర్యలు తీసుకోలేదంటే, రేవంత్ రెడ్డికి ఏమైన ముడుపులు అందాయా?
రేవంత్ రెడ్డి హోంమంత్రి శాఖ, ఈగల్ టీం, హైడ్రా టీం ఏం చేస్తుంది?
మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ కంపెనీపై రైడ్స్ చేస్తుంటే.. తెలంగాణ పోలీసులు కేసీఆర్ పాటలు పెట్టిన డీజే బాక్సులు తీసుకుపోవడంలో, రీట్వీట్ కొట్టిన వారిపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు – కేటీఆర్
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారు
20 రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు.. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున మేము ఎన్నికలు బహిష్కరించాము
మేము ఎన్డీఏ సబార్డినేట్ కాదు, ఇండియా సబార్డినేట్ కాదు.. మేము తెలంగాణ ప్రజల సబార్డినేట్
కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ.. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు అని కేటీఆర్ తెలిపారు

Arattai