హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి
నూజివీడు త్రిపుల్ ఐటీలో జరిగిన ఘోర ఘటన విద్యా వర్గాలను కుదిపేసింది. హాజరు తక్కువగా ఉండటంతో పరీక్ష రాయనివ్వలేదని ఆగ్రహంతో ఒక ఎం.టెక్ విద్యార్థి, ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడు. అదృష్టవశాత్తూ, సహచర విద్యార్థులు వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.
ఎలా జరిగింది?
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరానికి చెందిన ఎం.టెక్ (ట్రాన్స్‌పోర్ట్) విద్యార్థి మజ్జి వినాయక పురుషోత్తం పరీక్ష రాయడానికి వచ్చాడు.
-
సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజు డ్యూటీలో ఉండగా, హాజరు 70%కు తగ్గిందని ఆయనను పరీక్ష హాల్లోకి అనుమతించలేదు.
-
“హెచ్‌ఓడీ అనుమతి తీసుకురా” అని సూచించారు. కానీ హెచ్‌ఓడీ కూడా పరీక్షకు అనుమతించలేదు.
-
తిరిగి పరీక్ష హాల్ వద్ద గోపాలరాజును సంప్రదించినప్పటికీ నిరాకరించడంతో పాటు బయటకు వెళ్లిపోవాలని చెప్పారు.
అప్పటికే ఆగ్రహంతో ఉన్న పురుషోత్తం, ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న రెండు కత్తుల్లో ఒకదాన్ని తీసి ప్రొఫెసర్‌పై దాడి చేశాడు.
విద్యార్థుల ధైర్యం – ప్రొఫెసర్ ప్రాణాపాయం తప్పింది
ప్రొఫెసర్ గోపాలరాజుకు పలు చోట్ల గాయాలు అయినప్పటికీ, సహచర విద్యార్థులు అప్రమత్తమై వెంటనే పురుషోత్తంను పట్టుకుని అతని వద్ద ఉన్న కత్తిని లాక్కున్నారు. గాయపడిన గోపాలరాజును ఆసుపత్రికి తరలించారు.
పురుషోత్తం రెండు కత్తులు వెంట తీసుకువచ్చిన విషయాన్ని పోలీసులు గమనించారు. దీని ఆధారంగా ఇది ముందుగా ప్లాన్ చేసిన దాడి అని అనుమానిస్తున్నారు.
కేసు నమోదు – కోర్టుకు నిందితుడు
పోలీసులు పురుషోత్తంపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
మంత్రి నారా లోకేష్ స్పందన
ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ –
-
“గురువులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వారు ఎప్పుడూ విద్యార్థుల చెడును కోరుకోరు” అన్నారు.
-
“విద్యార్థులు హింస, నేరప్రవృత్తిని ప్రోత్సహించరాదు, ఉపేక్షించరాదు” అని స్పష్టం చేశారు.
👉 ఒక చిన్న నిర్ణయంపై ఇంత పెద్ద హింసకు దిగడం, చదువుతున్న యువతలో పెరుగుతున్న అసహనాన్ని చూపిస్తోంది.
Arattai