WhatsApp Data Breach: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో తాజాగా ఒక తీవ్రమైన భద్రతా లోపం బయటపడింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 350 కోట్ల మంది (3.5 బిలియన్) వినియోగదారుల ఫోన్ నంబర్లు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని ఆస్ట్రియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వియన్నా’ పరిశోధకులు హెచ్చరించారు.
ఈ లోపం కారణంగా హ్యాకర్లు లేదా సైబర్ నేరగాళ్లు భారీ ఎత్తున ఫోన్ నంబర్లను తస్కరించే అవకాశం ఉందని వారి అధ్యయనంలో తేలింది.
పరిశోధకుల వివరాల ప్రకారం, వాట్సాప్ సిస్టమ్‌లోని కొన్ని సాంకేతిక లోపాలను ఆధారంగా చేసుకుని, హ్యాకర్లు ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌ల ద్వారా కోట్లాది ఫోన్ నంబర్లను పరీక్షించి, అవి వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నాయో లేదో తెలుసుకోగలుగుతున్నారు. ఈ ప్రక్రియ ద్వారా కేవలం ఫోన్ నంబర్లు మాత్రమే కాకుండా, ఆ నంబర్లకు అనుసంధానించబడిన ప్రొఫైల్ ఫోటోలు, స్టేటస్ వంటి వ్యక్తిగత వివరాలను కూడా సేకరించే ప్రమాదం ఉంది.
ఇలా సేకరించిన డేటాబేస్‌ను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో విక్రయించడం, లేదా ఫిషింగ్ (Phishing) దాడులు, స్పామ్ మెసేజ్‌లు మరియు ఆర్థిక మోసాలకు వినియోగించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెటా (Meta) సంస్థ వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందని, యూజర్ల డేటా సురక్షితమని చెబుతున్నప్పటికీ, ఈ తాజా నివేదిక ఆ నమ్మకాన్ని సవాలు చేస్తోంది. ఇంత భారీ స్థాయిలో డేటా లీక్ అయ్యే అవకాశం ఉండటం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది.
రాష్ట్ర హాస్టల్స్‌లో భారీ మార్పు
ఈ లోపాన్ని సరిదిద్దడానికి వాట్సాప్ సంస్థ తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉందని, ‘రేట్ లిమిటింగ్’ వంటి కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వియన్నా పరిశోధకులు సూచించారు. ప్రస్తుతానికి వినియోగదారులు తమ గోప్యతా సెట్టింగ్స్ (Privacy Settings) పట్ల అప్రమత్తంగా ఉండాలని, ‘లాస్ట్ సీన్’, ‘ప్రొఫైల్ ఫోటో’ వంటి ఆప్షన్లను కేవలం కాంటాక్ట్స్ వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Arattai