
మొగుడి దొంగ బుద్ధి.. భార్యను పుట్టింటికి పంపించి పరార్
చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే మహ్మద్ జైనుద్దీన్‌కి 2022లో హనా అహ్మద్‌తో పెళ్లి
కొంతకాలం భార్యతో హైదరాబాద్‌లోనే ఉండి.. ఉద్యోగ రీత్యా అమెరికాకి వెళ్లిపోయిన జైనుద్దీన్
వీసా ప్రాసెస్ పూర్తయ్యాక 2024లో అమెరికా వెళ్లిన హనా.. కొన్నాళ్లు సజావుగా సాగిన కాపురం
ఆ తర్వాత భార్యని వేధించడం మొదలుపెట్టిన జైనుద్దీన్.. శారీరకంగా చిత్రహింసలు పెట్టిన వైనం
విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేయగా, అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో పథకం వేసిన మహ్మద్
ఉమ్రా కోసమని భార్యతో హైదరాబాద్ వచ్చిన మహ్మద్.. సోమాజిగూడలో ఉన్న ఓ హోటల్‌లో బస
కుటుంబ సభ్యుల్ని కలిసి రమ్మని భార్యను పుట్టింటికి పంపి.. హోటల్ ఖాళీ చేసిన మహ్మద్ పరార్
హోటల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పడంతో.. వెంటనే హోటల్‌కు తిరిగి బయలుదేరిన హనా
అప్పటికే అతను పాస్‌పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలతో పారిపోయినట్టు గుర్తించిన హనా కుటుంబం
మోసపోయానని గ్రహించి.. తల్లిదండ్రులతో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హనా ఫిర్యాదు
#HanaAhmedKhan #MohammedZainuddin #Hyderabad
Arattai