అమరావతి, అక్టోబర్ 22: డోర్ స్టిక్కర్ విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా “ప్రతి ఇంటా స్వదేశీ – ఇంటింటా స్వదేశీ” కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన డోర్ స్టిక్కర్ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ పాల్గొన్నారు.
దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. “ప్రతి కుటుంబం స్వదేశీ ఉత్పత్తులను వాడితే, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఇది నిజమైన ఆత్మనిర్భర్ భారత్ దిశలో మరో అడుగు,” అని ఆయన పేర్కొన్నారు.
జనసేన–బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ప్రజలను స్వదేశీ ఉత్పత్తుల వినియోగంలో ముందుండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో కొనసాగించాలని నిర్ణయించారు.
Arattai