Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

దేశంలో SIR ఎందుకు తప్పనిసరి? బెంగాల్ ఓటర్ లిస్ట్ గందరగోళం అసలు పరిస్థితిని బట్టబయలు చేస్తోంది!

Share Post
Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

📢 దేశంలో SIR ఎందుకు తప్పనిసరి?
బెంగాల్ ఓటర్ లిస్ట్ గందరగోళం అసలు పరిస్థితిని బట్టబయలు చేస్తోంది!ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వల్ల బయటకు వస్తున్న డేటా — దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో వుండే సమస్య ఉందో చూపిస్తోంది.

🔴 25 లక్షల ఓటర్లు చిరునామాలో కనిపించకపోవడం — ఇది చిన్న విషయం కాదు

బెంగాల్‌లో 7.66 కోట్ల ఓటర్లలో 25 లక్షల మంది BLO అధికారులు ఎన్నిసార్లు వెళ్లినా తమ రిజిస్టర్డ్ అడ్రస్‌లో కనిపించలేదు.
➡️ అంటే వారు ఆ ప్రాంతం వదిలి ఏళ్ల క్రితమే వెళ్లిపోయారు
➡️ లేదా కొత్త అడ్రస్‌లో కొత్త ఓటర్ ID తీసుకున్నారు
➡️ కానీ పాత అడ్రస్‌లోని ఓటర్ లిస్టు నుండి Form–7 ద్వారా పేరు తొలగించలేదు

ఇలా దేశంలో ఎక్కడైనా జరగవచ్చు — ఇలాగే డూప్లికేట్ ఓటర్ IDలు పుడతాయి,

🔴 అర్బన్ & పెరి-అర్బన్ ప్రాంతాల్లో సమస్య విపరీతం

న్యూ టౌన్, కస్బా, బెహాలా, రాజరహట్, సోనార్పూర్, దుర్గాపూర్, ఆసన్సోల్ వంటి ప్రాంతాల్లో చిరునామాలు మారడం ఎంతో కామన్.
➡️ ఉద్యోగ బదిలీలు
➡️ ఇళ్ల మార్పులు
➡️ రెంటల్ షిఫ్టులు
➡️ విదేశీ ట్రావెల్

మన ముందే ఇంకొక పెద్ద ఉదాహరణ వుంది . ఆంధ్ర నుండి తెలంగాణ , తెలంగాణ నుండి కర్ణాటక , మహారాష్ట్ర ఇలా ఉద్యోగ రీత్యా , వ్యాపార రీత్యా వచ్చిన వారు , వెళ్లిన వారు సాధారముగా వారి వారి సొంత ఊళ్లలో ఓటర్ ID లు రద్దు చేయించుకోరు . నెమ్మదిగా ఫలు దఫాలుగా ఎన్నికల సంఘము వీటిని రివ్యూ చేసి తొలగించింది , ఇంకా వుండే ఉంటాయి ; 2023 ఎన్నికలల్లో హైదరాబాద్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో ఓటులేసి , 2024 లోక్సభ ఎన్నికలకు బస్సు లు , ట్రైన్ , కార్లేసుకొని హైదరాబాద్ నుండి సొంత ఊళ్లకు వెళ్లి వోట్లుఎసిన దాఖలాలు మన ముందే ఎన్నో ;

ఇవన్నీ ఓటర్ లిస్ట్‌ను త్వరగా పాతబోయేలా చేస్తున్నాయి.

🔴 BLOలు ఎన్ని సార్లు వెళ్ళినా — ‘అతను ఇక్కడ వుండటం లేదు’

AP & TS Govt Jobs 2025: నోటిఫికేషన్లు ఎప్పుడు? తాజా అప్డేట్స్ ఇవే!

BLOలకు ఓటర్ ఉన్నాడా లేడా అనేది చెక్ చేయడం అసలు పని.
కానీ బెంగాల్‌లో చాలా చోట్ల BLOలు
➡️ “ఓటర్లు ఇక్కడే ఉండటం లేదు”
➡️ “వాళ్లు అమెరికాలో ట్రిప్‌లో ఉన్నారు”
➡️ “అడ్రస్‌లో కొత్త కిరాయిదారులు ఉన్నారు”
ఇలా ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఫారాలు డెలివర్ అవ్వడం అసాధ్యం.

🔴 మరింత భయంకర డేటా — 46 లక్షల “చనిపోయినవారి పేర్లు” ఇంకా రోల్స్‌లో

ఇటీవల 5–7 ఏళ్లలో మరణించిన వారిలో
➡️ 33 లక్షల ఆధార్ డీఆక్టివేట్ అయింది
➡️ 13 లక్షల వద్ద ఆధార్ లేదు

అయినా వారి పేర్లు లిస్ట్‌లో అలాగే ఉండే అవకాశం ఉంది.

ఇది దేశమంతటా కూడా ఉండే సమస్య.
👉 బీహార్‌లో 65 లక్షల పేర్లు తొలగిస్తే,
👉 బెంగాల్‌లో 70 లక్షలకు పైగా ఉండే అవకాశాన్ని అధికారులు చెప్పారు.

🔴 సిస్టమ్ ఎలా పనిచేయాలి?

ఒక వ్యక్తి మరణించినా, చిరునామా మార్చినా, అదే కుటుంబం లేదా ఆయా వ్యక్తి:
➡️ పంచాయతీ ఆఫీస్ లేదా మున్సిపాలిటీలో సమాచారం ఇవ్వాలి
➡️ సంబంధిత ఫారం సమర్పించాలి
➡️ BLO వచ్చి చెక్ చేసి అప్రూవ్ చేస్తాడు

⚠️ కానీ ప్రజల్లో అవగాహన లేక, నిర్లక్ష్యం వలన ఇది చేయడం లేదు.
అందుకే దేశంలో కోట్ల మంది పేర్లు తప్పుగా లిస్టులో ఉండిపోతున్నాయి.

🌧️🔥 వర్షాలు & వేడి – వాతావరణం ఈరోజు ఎందుకు మార్పు చూపిస్తోంది?

🔴 Aadhaar–Voter ID లింక్ పూర్తిగా అమలుకాకపోవడంతో ఇది ఇంకా manual process

Aadhaar లో చిరునామా మార్చినా, ఓటర్ లిస్టులో ఆటోమేటిక్ గా అప్‌డేట్ కావడం లేదు. ఇది చేయాలి అంటే కొంత టెక్నికల్ సమస్యలున్నాయి , కోర్ట్ తీర్పులున్నాయి ; వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలి
అందుకే అప్పుడప్పుడూ SIR తప్పనిసరి.
ఒక వేళా ఈ ప్రాసెస్ అంత ఆటోమేటెడ్ అయ్యాక కూడా SIR తప్పనిసరి .

🗳️ అందుకే ఎన్నికల సంఘం ప్రతి 5 ఏళ్లకు SIR చేయాలి.

ఇది ఓటర్ లిస్ట్ ప్రక్షాళన, శుద్ధి చేయడానికి అనివార్యమైన ప్రక్రియ.

🔴 ఇదంతా బయటపడుతున్నా… కాంగ్రెస్ మాత్రం దేశవ్యాప్తంగా SIR కి వ్యతిరేక ఆందోళనకు సిద్ధమవుతోంది.

దేశ ప్రజాస్వామ్యం మరింత శుభ్రంగా ఉండాలంటే SIR వంటి ప్రాసెస్‌లు అవసరం —
దానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం ప్రజాస్వామ్య ప్రయోజనానికి సరిపోతుందా? ప్రజలే నిర్ణయించాలి

— ఉపద్రష్ట పార్ధసారధి
#SIR #ElectoralRoll #WestBengal #VoterList #ElectionCommission #CleanVoterList #Democracy

Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Leave a Comment

Dark Mode