డీఎస్సీ అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే డీఎస్సీ…
ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డీఎస్సీలో ఎంపికైన వారే. 13 డీఎస్సీల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు.
మెగా డీఎస్సీ ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. డీఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు.కానీ సీఎం డైరెక్షన్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాం. 70 కేసులు పడ్డాయి… కానీ డీఎస్సీ మాత్రం ఆగలేదు.
టీచర్లు అంటే రేపటి పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు. వాళ్ళను పాలకులు గౌరవిస్తే అది విద్యార్థులు కూడా నేర్చుకుంటారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన నారా లోకేష్ గారి వంటి విద్యాధికుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తుండటం మన ‘బడి’ చేసుకున్న అదృష్టం.
“ఏపి టీచర్” అంటే ఇది.. గర్వంగా చెప్తున్నాం…
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని పిలుపిస్తే… స్కూటరుకు మైక్ కట్టుకుని అనౌన్స్ మెంట్ చేస్తూ అడ్మిషన్లు పెంచిన ఉపాధ్యాయులు ఉన్నారు…
నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం… అందుకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నాను.
అందరితో చర్చించి… చాలా సంస్కరణలు తెచ్చాను…
* కరిక్యులంలో మార్పులు తెచ్చాం..
* వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని మరింత విస్తృతపరిచాం.
* సెమిస్టర్ వైజ్ బుక్స్ ప్రచురించాం.
* శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం.
* రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచాం.
తన వద్ద పనిచేసిన డ్రైవర్ ను చదువుకునేలా కలాం గారు ప్రోత్సహించారు.. కలాం గారి స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ నమస్కారాలు.
#TeachersDay
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

Arattai