Ys jagan సంచలన వ్యాఖ్యలు

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌  కాలేజీలను నిన్న కేబినెట్లో   స్కాంలకోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం, రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది.

దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబుగారూ. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరు ఉంది.

1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్‌ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా పెట్టారా? కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతికొద్దికాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి.

ఎన్నికలు ముగిశాక మరోచోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే,  గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్‌ అయ్యేవి కదా? మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది? అవినీతికోసం ఇంతగా తెగిస్తారా?

3. మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా? కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు?

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

ఇక్కడ సరిపడా మెడికల్‌ సీట్ల లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఇక్కడ ప్రయివేటు మెడికల్‌ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్‌, రష్యా, పిలిప్ఫైన్స్‌ లాంటి ఇతర దేశాలకూ పంపిస్తున్న మాట వాస్తవం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి NMC మెడికల్‌ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది చంద్రబాబుగారూ? పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబుగారూ?

4. ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని,  అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్‌ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా? ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?

5. రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబుగారూ? ఈ 15 నెలల కాలంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన, దాదాపు రూ. 300 కోట్లు, అంటే 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన  గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు.

చివరకు ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు అందించే “ఆరోగ్య ఆసరా’’ను కూడా సమాధిచేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగానూ దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.

6. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు త‌ప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది.

ఇది వాస్తవం కాదా? ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి? ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్‌ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా లేక రూ.25 లక్షలకా? అసలు ఈ 3257 ప్రొసీజర్లు అంటే, ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు, ఇక రూ.5వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం.

7. ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబుగారూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా? లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్‌ వ్యాపారం చేస్తారా?

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా? చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా?

కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు  చెందిన  కంపెనీలకు దోచిపెట్టడానికి మీ ఈ నిర్ణయాలంటున్న  ఆరోపణలకు, మీ సమాధానం ఏంటి?

8. ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు చంద్రబాబుగారూ. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దుచేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం.

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment