Tollywood: ‘ఆయన గోల్డ్ ఎహే’.. ఆ సింగర్‌కు టాలీవుడ్ అగ్ర హీరో నుంచి ఫోన్.. ఎవ్వరూ ఊహించని సంఘటన

Share Post

Tollywood: ‘ఆయన గోల్డ్ ఎహే’.. ఆ సింగర్‌కు టాలీవుడ్ అగ్ర హీరో నుంచి ఫోన్.. ఎవ్వరూ ఊహించని సంఘటన

టాలీవుడ్‌లో స్టార్ హీరోల గురించి చాలానే కథలు వినిపిస్తుంటాయి.
కానీ కొన్ని అనుభవాలు వింటే… నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.
అలాంటి ఓ అరుదైన అనుభవాన్ని తాజాగా ఓ యువ గాయని బయటపెట్టింది.

ఆమె ఎవరో కాదు… తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపై తన గానంతో గుర్తింపు తెచ్చుకున్న లాలస.
ఆ షోలో అతిథిగా వచ్చిన **నందమూరి బాలకృష్ణ**తో తనకు ఎదురైన అనుభవాలను లాలస తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆ జ్ఞాపకాలు తన జీవితంలోనే బెస్ట్ మూమెంట్స్ అని ఆమె చెప్పారు.

తెలుగు ఇండియన్ ఐడల్ షూటింగ్ రోజును గుర్తు చేసుకుంటూ లాలస ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సాధారణంగా గెస్టులు కంటెస్టెంట్లు రెడీ అయిన తర్వాత సెట్‌కు వస్తారని ఆమె చెప్పారు.
కానీ ఆ రోజు బాలకృష్ణ మాత్రం అందరికంటే ముందే వచ్చి సెట్‌లో కూర్చున్నారని తెలిపారు.

కంటెస్టెంట్లు కాస్ట్యూమ్స్ మార్చుకునేలోపే ఆయన సెట్‌లో ఉండడం చూసి తాము ఆశ్చర్యపోయామని చెప్పారు.
ఇది ఆయన క్రమశిక్షణకు నిదర్శనమని లాలస పేర్కొన్నారు.
బాలకృష్ణ సెట్‌లో ఉన్నంతసేపు ఓ ప్రత్యేక నిశ్శబ్దం, భయం, గౌరవం ఉంటాయని ఆమె తెలిపారు.

ఇక బాలకృష్ణ ఇంట్రడక్షన్ డాన్స్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను లాలస ప్రత్యేకంగా గుర్తుచేశారు.
కొరియోగ్రాఫర్ రెండు మూడు సార్లు మాత్రమే స్టెప్స్ చూపించగా,
అవి చాలా నిశితంగా గమనించి, కేవలం రెండు టేక్స్‌లోనే పూర్తి చేశారని చెప్పారు.

ఉస్తాద్ భగత్‌సింగ్ సెకండ్ సాంగ్  .. పవన్ ఎలివేషన్స్‌ భారీ ..
ఉస్తాద్ భగత్‌సింగ్ సెకండ్ సాంగ్  .. పవన్ ఎలివేషన్స్‌ భారీ ..

అంత అనుభవం, సీనియారిటీ ఉన్న వ్యక్తిని చూస్తే తాను నిజంగా సెల్యూట్ చేస్తానని లాలస అన్నారు.
ఆ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయ్యాక బాలకృష్ణ వెళ్లిపోయారని చెప్పారు.
అక్కడితో ఆ అనుభవం ముగిసిందని అనుకున్న సమయంలో అసలు ట్విస్ట్ మొదలైంది.

షూటింగ్ అయి దాదాపు వారం రోజులు గడిచిన తర్వాత,
లాలస ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పారు.
ఆ నంబర్ నందమూరి బాలకృష్ణదని గుర్తించలేకపోయానని ఆమె తెలిపారు.

ఆ సమయంలో తాను క్లాస్‌లో ఉండడంతో కాల్ అటెండ్ చేయలేకపోయానని చెప్పారు.
తర్వాత కాల్ బ్యాక్ చేస్తే లైన్ బిజీగా ఉందని తెలిపారు.
కొద్దిసేపటి తర్వాత మళ్లీ అదే నంబర్ నుంచి కాల్ వచ్చిందని చెప్పారు.

కాల్ లిఫ్ట్ చేయగానే…
“లాలస” అని బాలకృష్ణ వాయిస్ వినిపించేసరికి షాక్ అయ్యానని ఆమె చెప్పారు.
ఎపిసోడ్ షూటింగ్ రోజు కంగారులో ఎవరితోనూ సరిగా మాట్లాడలేకపోయానని,
అందుకే టాప్ సిక్స్‌లో ఉన్న కంటెస్టెంట్లందరికీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నానని బాలకృష్ణ చెప్పినట్లు లాలస వివరించారు.

దాదాపు పది నిమిషాల పాటు బాలకృష్ణ చాలా ఆప్యాయంగా మాట్లాడారని లాలస తెలిపారు.
తన చదువు, కుటుంబ సభ్యులు, సొంత ఊరు గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ఈ సంఘటన తర్వాత ఆయనపై తన గౌరవం మరింత పెరిగిందని అన్నారు.

ఇంతకీ కథ అక్కడితో ముగిసిందా అంటే… కాదు.
ఆ తర్వాత బాలకృష్ణకు కోవిడ్ వచ్చినప్పుడు,
లాలస “టేక్ కేర్ సర్” అంటూ ఒక సాధారణ మెసేజ్ పంపించారని చెప్పారు.

OTT Movie: అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకి సంక్రాంతి సూపర్ హిట్ మూవీ.. నవ్వులకు సిద్ధంగా ఉండండి
OTT Movie: అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకి సంక్రాంతి సూపర్ హిట్ మూవీ.. నవ్వులకు సిద్ధంగా ఉండండి

ఆ మెసేజ్‌కు అప్పట్లో రిప్లై రాలేదని,
కానీ దాదాపు వారం రోజుల తర్వాత బాలకృష్ణ మళ్లీ స్వయంగా ఫోన్ చేశారని తెలిపారు.
మెసేజ్‌కు అప్పుడే స్పందించలేకపోయినందుకు సారీ చెప్పారని లాలస వెల్లడించారు.

ఆ కాల్‌లో ఐదు నిమిషాల పాటు కోవిడ్ లక్షణాలు, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
తనలాంటి ఓ చిన్న గాయనితో ఇంత ఆప్యాయంగా మాట్లాడటం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని లాలస అన్నారు.

బాలకృష్ణకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా,
తనలాంటి వారికి కూడా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం ఆయన గొప్పతనమేనని లాలస ప్రశంసించారు.
“ఆయన నిజంగా గోల్డ్” అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.

Leave a Comment