Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..
కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు చూస్తే సామాన్యుడికి గుండె దడేల్‌మనే పరిస్థితి.
సునామీలా పరుగులు పెట్టిన ధరలు ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి.
ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది.
బడ్జెట్‌కు ముందు ధరలు తగ్గుముఖం పట్టడం వినియోగదారుల్లో ఊరటనిచ్చే అంశంగా మారింది.
గ్రాము బంగారం కొనాలన్నా భయపడే స్థితిలో ఉన్న సమయంలో
ఇలాంటి తగ్గుదల రావడం సహజంగానే ఆసక్తి కలిగిస్తోంది.
వెండి ధరల్లో అయితే భారీ పతనం నమోదైంది.
ఒక్క రోజులోనే తులం వెండి ధర దాదాపు రూ.85 వేల వరకు తగ్గడం మార్కెట్‌ను షాక్‌కు గురి చేసింది.
ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజులో తగ్గడం అరుదుగా కనిపించే పరిణామమే.
ఇక బంగారం ధరల విషయానికి వస్తే…
వెండితో పోలిస్తే తగ్గుదల కొంత తక్కువగానే ఉన్నా,
గ్రాము, తులం లెక్కన చూసుకుంటే వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చే స్థాయిలోనే మార్పు కనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి.
తులం బంగారం ధర రెండు లక్షల రూపాయల దిశగా కదలడంతో
ఆభరణాల కొనుగోలు పూర్తిగా మందగించింది.
పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న కుటుంబాలు కూడా
కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది.
అలాంటి సమయంలో ఇప్పుడు వచ్చిన ధరల పతనం
మళ్లీ మార్కెట్‌లో కదలిక తీసుకురావచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
వెండి ధరలు నాలుగు లక్షల రూపాయలు దాటిన తర్వాత
పరిశ్రమలు, చిన్న వ్యాపారులు కూడా కొనుగోళ్లపై వెనకడుగు వేశారు.
ఇప్పుడు ఒక్క రోజులోనే ఇంత పెద్ద తగ్గుదల రావడంతో
వెండి మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పడింది.
అయితే ధరలు తగ్గాయని వెంటనే భారీ కొనుగోళ్లు మొదలవుతాయా?
అంటే… ఇంకా ఆ స్థితి రాలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఎందుకంటే తగ్గినప్పటికీ ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు.
మరికొంత కాలం ధరలు ఇలానే తగ్గితేనే
సాధారణ కొనుగోలు దారుడు ముందుకు వచ్చే అవకాశం ఉందని
బంగారం వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం మాత్రం బంగారం, వెండి ధరల్లో వచ్చిన ఈ పతనం
మార్కెట్‌కు, వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చే పరిణామమే.
ఇక రానున్న రోజుల్లో ధరలు ఏ దిశగా కదులుతాయన్నదే
ఇప్పుడు అందరి ఆసక్తి.




Arattai