CM Chandrababu: హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయం.. నిబంధనలు అందరికీ ఒకటేనన్న సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రోజు రోజుకూ మరింత వేడెక్కుతోంది.
వరుస ఘటనలు, అరెస్టులు, ఘాటు వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.
తాజా పరిణామాలపై సీఎం N Chandrababu Naidu తీవ్ర స్థాయిలో స్పందించారు.
ప్రజల సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
గతంలో వైసీపీ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు.
దీంతో ఆ పార్టీ తీవ్ర నిరాశ, అసహనంలో ఉందని విమర్శించారు.
ఏపీ పునర్ నిర్మాణం వేగంగా సాగుతుండటాన్ని చూసి
వైసీపీ తట్టుకోలేకపోతోందని ట్వీట్ ద్వారా ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
ఇదే సమయంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో
వైసీపీ నేత Ambati Rambabuకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అంబటిని పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ ఘటనతో రాజకీయంగా ఉద్రిక్తత మరింత పెరిగింది.
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు తారస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
రాజకీయాలను నేరాల వైపు నడిపిన సంస్కృతి వైసీపీదేనని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ పాలన మొత్తం చట్ట రహితంగానే సాగిందని విమర్శించారు.
అలాంటి పరిస్థితులకు ప్రజలు ముగింపు పలికారని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
రాష్ట్రంలో మళ్లీ రూల్ ఆఫ్ లా అమలులోకి వచ్చిందని స్పష్టం చేశారు.
శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.
బీన్స్‌ను తీసి పారేస్తున్నారా.. ఇది తెలిస్తే తెచ్చుకుని మరి తింటారు
చట్టాన్ని ఉల్లంఘిస్తే
అది అధికారంలో ఉన్నవారైనా, ప్రతిపక్షంలో ఉన్నవారైనా
ఎవరినీ ఉపేక్షించబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు.
నిబంధనలు అందరికీ ఒకటేనని స్పష్టం చేస్తూ
హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రభుత్వం చట్టబద్ధంగానే పనిచేస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
వరుస అరెస్టులు, ఘాటు వ్యాఖ్యలతో
ఏపీ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా మలుపు తిరుగుతాయన్నది
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Amaravati: అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం

Arattai