గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం. విద్యుత్ వెలుగులు నింపుతున్నాము- Pawan Kalyan
పీఎం జన్మన్, ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా నిధులు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటికీ ఏదో ఒక మూలన గిరిజన గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్పందన కూడా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య చిన్న చిన్న సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. ఏళ్ల తరబడి కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయి.
ఆ ప్రాంత అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు నిబద్ధతతో వ్యవహరిస్తే అనేకం క్షేత్ర, డివిజన్, జిల్లా స్థాయిల్లోనే పరిష్కారం అవుతాయి. ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమీకృతం చేసుకుంటూ గిరిజనుల అభివృద్ధి పాటు పడాల్సిన ఐ.టి.డి.ఎ., జిల్లా యంత్రాంగం నిరంతర సమస్వయంతో సమస్యలకు పరిష్కారం చూపాలి.
సమస్య తీవ్రతను బట్టి ఏ స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్య ఆ స్థాయిలోనే పరిష్కారం కావాలి. గిరిజనుల సమస్యలను తీర్చాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి సమస్య ఉన్నత స్థాయి యంత్రాంగం దృష్టికి వెళ్తేనే పరిష్కారం అవుతుందన్న భావన ప్రజల్లో పోగొట్టాలి. ఆ బాధ్యతను ఐ.టి.డి.ఎ., జిల్లా స్థాయి పాలనా యంత్రాంగం, స్థానిక ప్రజా ప్రతినిధులు తీసుకోవాలి.
Related News
- పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై అప్రమత్తత అవసరం: శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి
- గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
Arattai