*అమరావతిలో 12 ఎకరాలకు సేకరణ ప్రకటన.*
పులింగులో ఇచ్చినా తీసుకుంటామన్న అధికారులు
రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మించే క్రమంలో సంబంధిత రైతులు, భూయజమానుల నుంచి APCRDA ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించినది. కాగా ఈ యొక్క రహదారి నిర్మించేందుకు క్రింద పేర్కొన్న గ్రామాల పరిధిలో సంబంధిత రైతులు, భూయజమానులు పూలింగ్ కింద భూములు ఇచ్చేందుకు ముందుకు రానందున APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్ గారి అధికారిక అభ్యర్థన మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఐ.ఏ.ఎస్. గారు ఆ యొక్క భూములను సీడ్ యాక్సిస్ రహదారి నిర్మించే నిమిత్తం భూసేకరణ చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదల చేసియున్నారు.
*ఉండవల్లి – 10.5018 ఎకరాలు
*పెనుమాక – 0.6500 ఎకరాలు
*మందడం-1 – 0.7000 ఎకరాలు
*రాయపూడి-1 – 0.4710 ఎకరాలు
*రాయపూడి-2 – 0.2530 ఎకరాలు
మొత్తం- 12.5758 ఎకరాల భూమిని భూసేకరణ చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ విడుదల చేసియున్నారు.
సంబంధిత రైతులు, భూయజమానులు అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు సిద్ధమైనట్లయితే తమ గ్రామంలోని కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
Related News
- గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం
- పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై అప్రమత్తత అవసరం: శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి
Arattai