హైదరాబాద్, అక్టోబర్ 22:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ భేటీ అయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో వివాదం చుట్టూ రాజకీయ వేడి చెలరేగిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.
ఇప్పటికే రిజ్వీ వాలంటరీ రిటైర్‌మెంట్ (VRS) కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆయన అభ్యర్థనను తిరస్కరించాలంటూ మంత్రి జూపల్లి ఇటీవల చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ పరిణామాల నడుమ సీఎంతో రిజ్వీ భేటీ జరగడం పలు ఊహాగానాలకు దారితీసింది.
క్యాబినెట్ సమావేశానికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో హాజరైన రిజ్వీ, ముఖ్యమంత్రితో ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. ఆయన VRS దరఖాస్తుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి ఇప్పుడు పెరిగింది.
అధికార వర్గాల్లో ఈ భేటీపై చర్చలు వేడెక్కుతున్నాయి.
Related News
- హైదరాబాద్‌లో కొత్త సినిమా థియేటర్లు.. సంక్రాంతి నాటికి ప్రారంభం, లిస్ట్ ఇదే
- ‘తెలంగాణకు ఆదర్శం చైనాలోని ఆ పట్టణమే’.. తొలి రోజే వేల కోట్ల పెట్టుబడులు
- దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: ప్రపంచ ప్రముఖుల రాకతో హైదరాబాద్ కేంద్రంగా
Arattai