శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఉపముఖ్యమంత్రి Pawan Kalyan కు ఆహ్వానం
• ఉప ముఖ్యమంత్రి ఆహ్వాన పత్రికను అందజేసిన మేనేజింగ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ రత్నాకర్ గారు
• గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారితోపాటు వేడుకల్లో పాల్గొంటానన్న పవన్ కళ్యాణ్
• పుట్టపర్తిలో రోడ్ల నిర్మాణానికి అదనంగా రూ. 30 కోట్లు మంజూరు
• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన ట్రస్ట్ బోర్డు సభ్యులు
భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టి శ్రీ రత్నాకర్ , ఇతర సభ్యులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
శత జయంతి ఉత్సవాల వివరాలు తెలియజేశారు. నవంబర్ 19వ తేదీన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో శత జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి గారితో కలసి వేడుకలకు హాజరవుతానని సత్యసాయి ట్రస్ట్ బోర్డు సభ్యులకు పవన్ కళ్యాణ్ తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.30 కోట్లు అదనంగా కేటాయించినట్టు చెప్పారు.
శత జయంతి ఉత్సవాలలోపు మందిరానికి అనుసంధాన రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సత్యసాయి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ రత్నాకర్ గారు ధన్యవాదాలు తెలిపారు.
PMO India Andhra Pradesh CM Press Information Bureau – PIB, Government of India I & PR Andhra Pradesh Press Information Bureau, Vijayawada

Arattai