వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు.

Share Post


తాడేపల్లి.

మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు.
దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు శుభాకాంక్షలు తెలిపారు.


లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు.

ఆకుకూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తప్పకుండా తినాల్సిన 5 కారణాలు!
ఆకుకూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తప్పకుండా తినాల్సిన 5 కారణాలు!

చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.


ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

జగన్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం వెనుక అసలు రాజకీయ లెక్కలు
జగన్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం వెనుక అసలు రాజకీయ లెక్కలు

Leave a Comment