మొంథా తుపాను అనంతర కార్యచరణపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

తుపాను ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలి• పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు• రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు• తాగు నీరు సరఫరాకు ఇబ్బంది ఏర్పడిన చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు• మొంథా తుపాను అనంతర కార్యచరణపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan‘మొంథా తుపానును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుపాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి. పటిష్టమైన ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలి. తుపాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు సూచించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలన్నారు. తుపాను ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్య ప్రకారం బాగు చేయాలన్నారు. మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు.
1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రివర్యులకు తెలియచేశారు. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామని చెప్పారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయనీ, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. రక్షిత తాగు నీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటిని అందించే పథకాలకు, నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయం చూడాలి. ఈ చర్యలు తక్షణమే తీసుకోవాలి. గ్రామాల్లో మొబైల్ శానిటేషన్ బృందాలను సిద్ధంగా ఉంచాలి. 21,055 మంది పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టండి. వాన నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలి. నీరు ఎక్కడ కలుషితం కాకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తరుణంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతాయి. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో వ్యాధులు రాకుండా అరికట్టాల్సిన బాధ్యత తీసుకోండి. మూడు, నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా దీనిపై దృష్టి సారించండి. మళ్ళీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. దీనిలో ఎక్కడ లోటుపాట్లకు తావు ఉండకూడదు. దెబ్బ తిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలి” అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.• శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి
తుపాను అనంతరం తన శాఖల వారీగా జరిగిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలను ఉన్నతాధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించగా దీనిపై తగిన సూచనలను ఉప ముఖ్యమంత్రి చేశారు.
• పంచాయతీరాజ్ శాఖ
– రాష్ట్రంలోని జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీపీవోలు, డీఎల్ డీఓలు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ సెక్రటరీలతోపాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా అందుబాటులో ఉండి పరిస్థితిని చక్కదిద్దాలి.
– సమాచార లోపం లేకుండా సమన్వయంతో పనిచేయాలి. అవసరమైతే టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిత్యం ఒకరికి ఒకరు మాట్లాడుకొని సమయానుకూలంగా పనులు పూర్తి చేయాలి. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అధికారులు పనులు సమన్వయం చేసుకోవాలి.– రాష్ట్రవ్యాప్తంగా 1158 మొబైల్ శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేసుకొని పారిశుధ్య పనులు మొదలుపెట్టాలి.
– తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో 1583 గ్రామాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నట్లు గుర్తించాం. పారిశుద్ధ్యం, ఇతర పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
– పంచాయతీల వద్ద అవసరమైనంత బ్లీచింగ్ నిల్వలు ఉన్నాయి. డ్రైనేజీల్లో అడ్డంకులు ఏర్పడితే క్షేత్ర స్థాయి సిబ్బంది తక్షణమే స్పందించాలి.
• గ్రామీణ నీటి సరఫరా శాఖ
– తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మొత్తం మీద గ్రామీణ నీటి సరఫరా శాఖకు చెందిన వివిధ మంచి నీటి పథకాలకు రూ.1.04 కోట్ల నష్టం ఏర్పడింది. వీటిని వెంటనే పునరుద్ధరణకు చర్యలు చేపట్టండి.
• పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్
– మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 779 రోడ్లు, 89 బ్రిడ్జ్ లు, 473 కల్వర్టులు దెబ్బ తిన్నాయి. వీటికి వెంటనే మరమ్మతులు మొదలుపెట్టండి.
– రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావంతో బ్లాక్ చేసిన రోడ్లను వెంటనే పునరుద్ధరణకు చర్యలు తక్షణమే చేపట్టండి.
– పాక్షికంగా ధ్వంసమైన రోడ్లు, వంతెనలను జిల్లా స్థాయి నిధులతో వెంటనే బాగు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయండి. అలాగే ఎస్.డి.ఆర్.ఎఫ్. ఫండ్స్ ద్వారా మిగిలిన వాటిని కూడా పునర్నిర్మించే ఏర్పాట్లు చేయాలి.#CycloneMontha
#APpreparesForMontha #PawanKalyanAneNenu #JanaSenaParty

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment