బీన్స్‌ను తీసి పారేస్తున్నారా.. ఇది తెలిస్తే తెచ్చుకుని మరి తింటారు
బీన్స్ అంటే చాలా మందికి సాధారణ కూరగాయలా అనిపిస్తుంది.
కానీ నిజానికి ఇవి రోజువారీ ఆహారంలో చాలా కీలకమైన పోషకాలను అందించే ఫుడ్.
కొంతమంది రుచిలేదని, ఇంకొందరు కడుపు ఉబ్బుతుందనే కారణాలతో బీన్స్‌ను పక్కన పెడుతుంటారు.
అయితే బీన్స్‌ను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే
ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదా అని అనిపించక మానదు.
అందుకే బీన్స్ అసలు ఎందుకు ముఖ్యమో ఇప్పుడు వివరంగా చూద్దాం.
బీన్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
శరీరానికి కావాల్సిన పోషకాలను సహజంగా అందించే కూరగాయల్లో ఇది ఒకటి.
అందుకే చాలామంది బీన్స్‌ను “సూపర్ ఫుడ్”గా కూడా పరిగణిస్తారు.
బీన్స్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
దీంతో గుండెకు సంబంధించిన సమస్యల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.
రక్తంలో షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో కూడా బీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
బీన్స్‌లో ఉండే పీచు పదార్థం గ్లూకోజ్ శోషణను నెమ్మదిగా చేస్తుంది.
దీంతో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సమతుల్యత ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బీన్స్ మంచి ఆహారంగా చెప్పొచ్చు.
ఎందుకంటే బీన్స్ తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.
దీంతో అనవసరంగా బయట ఫుడ్స్ తినాలనే కోరిక తగ్గుతుంది.
బీన్స్‌లో క్యాలరీలు తక్కువగా ఉండటం మరో ముఖ్యమైన అంశం.
తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలు అందించడం వల్ల
బరువు క్రమంగా తగ్గేందుకు ఇవి సహకరిస్తాయి.
జీర్ణవ్యవస్థకు కూడా బీన్స్ మేలు చేస్తాయి.
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.
మలబద్ధకం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
బీన్స్‌లో విటమిన్ సి కూడా కొంతమేర ఉంటుంది.
ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడే శక్తిని పెంచుతుంది.
ఇక బీన్స్‌లో ఉండే ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.
కాల్షియం, మాగ్నీషియం లాంటి మూలకాలు
ఎముకలను బలంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.
చాలామంది బీన్స్ తింటే గ్యాస్ వస్తుందని భయపడతారు.
కానీ సరైన విధంగా ఉడికించి, పరిమితంగా తీసుకుంటే
అలాంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
బీన్స్‌ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే
శరీరానికి అవసరమైన పోషకాలు సహజంగానే అందుతాయి.
అందుకే వీటిని తీసి పారేయకుండా, సరిగ్గా వండుకుని తినడం మంచిదని పోషక నిపుణులు చెబుతున్నారు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న బీన్స్‌ను
ఇప్పటివరకు లైట్ తీసుకున్నవారు కూడా
ఇకపై వంటల్లో చోటివ్వక తప్పదు.
Arattai