“ప్రతి ఇంటా స్వదేశీ – ఇంటింటా స్వదేశీ” డోర్ స్టిక్కర్ విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

అమరావతి, అక్టోబర్ 22: డోర్ స్టిక్కర్ విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆత్మనిర్భర్ భారత్‌ అభియాన్‌ లో భాగంగా “ప్రతి ఇంటా స్వదేశీ – ఇంటింటా స్వదేశీ” కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన డోర్ స్టిక్కర్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ పాల్గొన్నారు.

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. “ప్రతి కుటుంబం స్వదేశీ ఉత్పత్తులను వాడితే, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఇది నిజమైన ఆత్మనిర్భర్ భారత్‌ దిశలో మరో అడుగు,” అని ఆయన పేర్కొన్నారు.

జనసేన–బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ప్రజలను స్వదేశీ ఉత్పత్తుల వినియోగంలో ముందుండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో కొనసాగించాలని నిర్ణయించారు.

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment