తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Share Post

తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి.

ఆకుకూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తప్పకుండా తినాల్సిన 5 కారణాలు!
ఆకుకూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తప్పకుండా తినాల్సిన 5 కారణాలు!

సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని అందివ్వాలి. అనునిత్యం పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు , పేదల సేవలో పెన్షన్లు, మహిళామతల్లులకు ఆసరాగా నిలిచే ‘దీపం’, ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’, బిడ్డలను విద్యావంతుల్ని చేసే ‘తల్లికి వందనం’ రైతుకు అండగా నిలిచే ‘అన్నదాత సుఖీభవ’, పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు నడిపే ‘పీ4’ విధానం, పారిశ్రామిక ప్రగతితో ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ… మరొక్క మారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు
#vijayadashami

జగన్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం వెనుక అసలు రాజకీయ లెక్కలు
జగన్ అసెంబ్లీ బహిష్కరణ వ్యూహం వెనుక అసలు రాజకీయ లెక్కలు

Leave a Comment