తెలంగాణ గవర్నర్ కొడుకు నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన త్రిపుర రాష్ట్రం ఎమ్మెల్యే
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొడుకు ప్రతీక్ దేవ్ వర్మ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన త్రిపుర రాష్ట్రానికి చెందిన టీఎంపీ పార్టీ ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్
వెస్ట్ త్రిపురలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గొడవ చేస్తున్న ముగ్గురిని బయటికి వెళ్లమని చెప్పినందుకు, ప్రతీక్ దేవ్ వర్మతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరించారని ఆరోపించిన టీఎంపీ ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్
400–500 బీజేపీ కార్యకర్తలను తీసుకొచ్చి తనను, తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తామన్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు




Arattai