తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభం – 12 జిల్లాల 70 లక్షల కుటుంబాలకు బియ్యం, పంచదార, కిరోసిన్ పంపిణీ

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీ ప్రారంభించింది. 12 జిల్లాల 70 లక్షల కుటుంబాలకు అవసరమైన సరుకులు అందజేయనుంది.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభం

అమరావతి:
తుఫాన్ “మొంథా” ప్రభావంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది. తుఫాన్ ప్రభావిత ప్రజలకు అవసరమైన సరుకులు అందించేందుకు నేటి నుంచి రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.

ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 70 లక్షల కుటుంబాలకు బియ్యం, పంచదార, కిరోసిన్‌ను రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేయనుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆహార కొరతకు గురికాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నదెండ్ల మనోహర్ సమన్వయంతో జిల్లా స్థాయిలో అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

మంత్రి నదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,

“ప్రభుత్వం ప్రజల పక్కనే ఉంది. తుఫాన్ కారణంగా ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికీ రేషన్ సరఫరా చేయడం మా బాధ్యత,” అని పేర్కొన్నారు.

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

అదేవిధంగా, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, నీటి వసతులు పునరుద్ధరణకు సంబంధించి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రతి జిల్లాలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ –

“ప్రభుత్వ సూచనలు పాటించండి, ఎటువంటి పుకార్లను నమ్మవద్దు, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించండి” అని తెలిపింది.

Andhra Pradesh Cyclone Relief,

Ration Distribution AP,

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Nara Chandrababu Naidu,

Nadendla Manohar,

Pawan Kalyan Deputy CM,

Cyclone Affected Areas AP,

Andhra Pradesh Disaster Relief,

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment