చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్
•గ్రంథాలయం నిండుగా పుస్తకాలతో నింపేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
•మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి
•అందుబాటులోకి వచ్చిన 25 కంప్యూటర్ల అధునాతన స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్
•లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్, కూటమి నాయకులు

పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గమనించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ రోజు జరిగిన సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొమ్మిది రోజుల్లో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయించారు. లైబ్రరీని పుస్తకాలతో నింపేశారు. చిన్నారుల కోసం పెద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతోపాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు.‘తెలంగాణకు ఆదర్శం చైనాలోని ఆ పట్టణమే’.. తొలి రోజే వేల కోట్ల పెట్టుబడులు
సోమవారం చిలకలూరిపేట శాసన సభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, మాజీ శాసన సభ్యులు శ్రీ కిలారి రోశయ్య, కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చారు.
– ఒక చోట ఆట స్థలం.. మరో చోట అధునాతన కిచెన్
18 నెలల్లో ₹20 లక్షల కోట్ల పెట్టుబడులు: టొరాంటోలో కెనడాకు ఆంధ్రప్రదేశ్ గట్టి పిచ్

Related News
- గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం
- పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై అప్రమత్తత అవసరం: శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి
Arattai