కూటమి ప్రభుత్వంలో విలేకరులకు రక్షణ కరువు – ఎర్రమట్టి దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.


మాజీ మంత్రి సాకే శైలజానాథ్, పసులూరులో విలేకరి పెద్దన్నపై దాడి ఘటనపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కూటమి ప్రభుత్వంలో విలేకరులకు రక్షణ కరువు

ఎర్రమట్టి అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్

అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్. కూటమి ప్రభుత్వంలో ప్రజల తరపున నిలిచే విలేకరులు నిత్యం బెదిరింపులు, దాడుల బారిన పడుతున్నారని ఆయన విమర్శించారు.

బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేకరి పెద్దన్న పై టిడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై శైలజానాథ్ తీవ్రంగా స్పందించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


కులదూషణ చేసిన వారిపై కేసు నమోదు చేయాలి

ఈ ఘటనపై వెంటనే బుక్కరాయసముద్రం ఎస్సై రామ్‌ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడిన శైలజానాథ్, “కులం పేరుతో దూషించి, భౌతిక దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి” అని డిమాండ్ చేశారు.

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

అక్రమ ఎర్రమట్టి దందాపై ఆగ్రహం

అనంతరం ఆయన జగనన్న కాలనీలో టిడీపీ కార్యకర్తలు అక్రమంగా తరలించిన ఎర్రమట్టి లేఅవుట్స్‌ను పరిశీలించారు.
“లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వమే ఇచ్చిన లేఅవుట్స్‌ను ఇప్పుడు కొందరు వ్యక్తులు ఎర్రమట్టిగా విక్రయిస్తున్నారు. ఇది ప్రజల పట్ల మోసం,” అని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ఈ వ్యవహారంపై స్పందించి, ప్రభుత్వ లేఅవుట్స్‌లో జరుగుతున్న ఎర్రమట్టి దందాపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


“ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పేందుకు భయం లేదు”

“ప్రజల ఆస్తులు దోచుకుంటే ఎవరి పేరైనా చెప్పడానికీ మాకు భయం లేదు,” అని సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.
“ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు.

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

విలేకరులపై దాడులు ఆందోళనకరం

విలేకరులపై దాడులు జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ,
“ప్రజల తరపున వాస్తవాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం,” అని ఆయన హెచ్చరించారు.


ప్రజల తరపున పోరాటం కొనసాగుతుందని స్పష్టం

తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై నిర్భయంగా వార్తలు రాసే విలేకరులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని శైలజానాథ్ తెలిపారు.
“ప్రజల న్యాయం కోసం, దళితుల గౌరవం కోసం నేను ఎప్పుడూ ముందుంటాను,” అని ఆయన స్పష్టం చేశారు.

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment