ఏపీలో ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స |ఏపీ కేబినెట్ నిర్ణయం

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

ఏపీలో ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స |

ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక పథకాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా ఈ కొత్త విధానం పని చేస్తుంది. 2,493 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతాయి . 3,257 చికిత్సలను ఉచితంగా అందిస్తారు . ఆదాయంతో పని లేకుండా రాష్ట్రంలో ఉన్న పౌరులు అందరూ దీనికి అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడకుండా, ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందగలరని ప్రభుత్వం భావిస్తోంది. ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అమలవుతుంది.

ఇందులో ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు అన్ని రకాల వైద్య చికిత్సలు కవర్ అవుతాయి. ప్రస్తుత ఎన్టీఆర్ వైద్య సేవల కవరేజ్‌ను రూ.5 లక్షలు మాత్రమే ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందవచ్చు.

ఈ పాలసీ త్వరలోనే అమలులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకంతో సమన్వయం చేసి, డిజిటల్ కార్డులు జారీ చేస్తుంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌కేర్ వ్యవస్థను గ్లోబల్ స్టాండర్డ్‌లకు చేర్చడానికి ఒక అడుగుగా భావిస్తున్నారు.

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment