Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ఎస్‌ సీ, ఎస్‌ టి గృహాల సోలరైజేషన్ కు ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం

Share Post
Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

*ఎస్‌ సీ, ఎస్‌ టి గృహాల సోలరైజేషన్ కు ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం*

ఎస్ సీ, ఎస్ టి గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఏపీఈపీడీసీఎల్ సంస్థ సద్భవ్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం సోమవారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగింది. సంస్థ సీఎండి ఇమ్మడి పృథ్వీతేజ్, డైరెక్టర్ (ఆపరేషన్స్) టి.వి. సూర్యప్రకాశ్ సమక్షంలో సీజీఎం ఎల్. దైవప్రసాద్, సద్భవ్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ డైరెక్టర్ భూపేంద్ర సింగ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

🔥 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ… 18 నెలల్లోనే 23 లక్షల ఉద్యోగ ఒప్పందాలు! ఏపీ పనితీరుకు ఇదే సాక్ష్యం

ఈ ఒప్పందం కింద నర్సీపట్నం, పాలకొండ, పెద్దాపురం, రామచంద్రపురం, టెక్కలి, విజయనగరం రూరల్, తాడేపల్లిగూడెం డివిజన్లలోని 44,998 ఎస్‌ సీ – ఎస్‌ టి సర్వీసులకు మొత్తం 90 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

*పీఎం సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సోలార్*

గ్రీన్ ఎనర్జీ, నీరు, భూమి… కొరత లేకుండా! రియల్ టైమ్ క్లియరెన్స్‌తో Speed of Doing Business అంటే ఏమిటో చూపిస్తున్న ఏపీ

పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని సుమారు 2 లక్షల ఎస్‌ సీ, ఎస్‌ టి గృహాలపై ఉచితంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ పథకం కింద ప్రతి ఎస్ సీ/ఎస్ టి గృహ వినియోగదారుని ఇంటిమీద 200 చదరపు అడుగుల ప్రాంతంలో, 2 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయి.

Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Leave a Comment

Dark Mode